ఐపీఎల్ 2025లో భారీగా జరిమానాలు పడింది ఈ ఏడుగురికే.. ఎందుకంటే? ఫుల్ లిస్ట్..
లక్షలాది రూపాయల జరిమానాలు పడ్డాయి.

Pic: @BCCI
ఐపీఎల్ 15 సీజన్ ఊహించిని దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతోంది. కొందరు ఆటగాళ్లు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. అయితే ఆటగాళ్ల ప్రవర్తన, ఓవర్ రేట్ల విషయంలో కొన్ని నియమాల ఉల్లంఘనలు జరిగాయి. ఇప్పటివరకు ఈ సీజన్ లో ఆటగాళ్లకు పడిన జరిమానాల గురించి తెలుసుకుందాం..
12.6 క్లాజ్ ప్రకారం, ప్రతి జట్టు ఒక గంటలో 14.11 ఓవర్లను పూర్తి చేయాలి. 14.11 ఓవర్లు= 14 ఓవర్లు + ఆ తదుపరి ఓవర్‌లోని 2/3 వంతు. ఆటలో ఆటంకాలు లేకపోతే, మొదటి ఇన్నింగ్స్ ప్రారంభమైన 90 నిమిషాల్లో 20 ఓవర్లు పూర్తి కావాలి. ఇందులో 85 నిమిషాల ఆట సమయం, అలాగే 5 నిమిషాల టైమ్-అవుట్ సమయం. ఈ నియమాన్ని ఉల్లంఘించిన జట్టు కెప్టెన్‌లకు తప్పకుండా జరిమానాలు విధిస్తారు.
ఫైన్లు పడింది వీళ్లకే..
రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్ తరఫున మొదటి మూడు మ్యాచులకు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తిచేయలేకపోయాడు. ఇది జట్టు మొదటి తప్పిదం కావడంతో అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు.
సంజూ శాంసన్: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఓవర్ రేట్ ఉల్లంఘన కారణంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్‌పై రూ.24 లక్షల జరిమానా, మిగిలిన సభ్యులపై ఒక్కొక్కరికి రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ విధించారు.
రిషభ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పంత్.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ వల్ల రూ.12 లక్షల జరిమానా చెల్లించాడు.
రజత్ పటీదార్: ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు జట్టు కెప్టెన్ పటీదార్ కు స్లో ఓవర్ రేట్ల వల్ల తొలిసారి జరిమానాను విధించారు.
హార్దిక్ పాండ్యా : మార్చి 29న నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఓవర్ రేట్ ఉల్లంఘన కారణంగా కెప్టెన్ పాండ్యాపై రూ.12 లక్షల జరిమానా విధించారు.
అనుచిత ప్రవర్తన కారణంగా విధించిన జరిమానాలు
దిగ్వేశ్ రాథి: లక్నో తరపున అడుగుపెట్టిన 25 ఏళ్ల రాథి మూడు సార్లు జరిమానా ఎదుర్కొన్నాడు. ఏప్రిల్ 1న ప్రియాంశ్ ఆర్యా వికెట్ తీసిన తరువాత అతనిపై మొదటి ఉల్లంఘనగా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా పడింది. ఆ తరువాత ముంబై ఇండియన్స్ ఆటగాడు నామన్ ధీర్‌పై తన ప్రవర్తనతో మరోసారి రాథికి 50% జరిమానా పడింది. చివరికి సునీల్ నరైన్‌ను ఔట్ చేసిన తర్వాత ప్రవర్తించిన తీరుకు మరో 3 డిమెరిట్ పాయింట్లు అతని ఖాతాలో చేరాయి.
ఇషాంత్ శర్మ: గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సీనియర్ బౌలర్ ఇషాంత్, ఐపీఎల్ 20వ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన ఆటలో అనుచితంగా ప్రవర్తించాడు. ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం ఫైన్ పడింది. అతనికి మ్యాచ్ ఫీజులో 25% జరిమానాతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ పడింది.